ఆంధ్రప్రదేశ్

3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ ఔదార్యం

 సిరా న్యూస్,తాడేపల్లిగూడెం; పెంటపాడు మండలం పత్తిపాడు ఫుడ్ పాడ్స్ ఫెర్టిలైజర్3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ తమ ఔదార్యం చాటుకుంది. సేవే పరమావధిగా ముందుకు వేస్తూ పలు సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తూ కృష్ణా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు మంగళవారం 3 ఎఫ్ స్వాభి మాన్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. సుమారు ఐదు వేలు ఆహార ప్యాకెట్లను తమ సంస్థకు చెందిన సొంత వ్యాన్ లో రెవెన్యూ అధికారుల ద్వారా కృష్ణా జిల్లాకు పంపించారు. ఈ సందర్భంగా3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ అధినేత ఓపి గోయంకమాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని అవి వచ్చినప్పుడు మానవత్వంతో బాధితులకు అందరూ అండగా నిలవాలన్నారు. అందులో భాగంగానే తమ సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశామన్నారు.…

Read More
4 Sep 2024, 6:55 pmsiranews.in