సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
పెంటపాడు మండలం
పత్తిపాడు ఫుడ్ పాడ్స్ ఫెర్టిలైజర్3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ తమ ఔదార్యం చాటుకుంది. సేవే పరమావధిగా ముందుకు వేస్తూ పలు సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తూ కృష్ణా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు మంగళవారం 3 ఎఫ్ స్వాభి మాన్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. సుమారు ఐదు వేలు ఆహార ప్యాకెట్లను తమ సంస్థకు చెందిన సొంత వ్యాన్ లో రెవెన్యూ అధికారుల ద్వారా కృష్ణా జిల్లాకు పంపించారు. ఈ సందర్భంగా3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ అధినేత ఓపి గోయంకమాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని అవి వచ్చినప్పుడు మానవత్వంతో బాధితులకు అందరూ అండగా నిలవాలన్నారు. అందులో భాగంగానే తమ సంస్థ ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశామన్నారు. ఈ విషయంలో అందరూ బాధితులకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో అనేకం చేసామని ప్రస్తుతం చేస్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జనరల్ మేనేజర్3 ఎఫ్ హెచ్ఆర్ జున్నూరు జనార్ధన్ మాట్లాడుతూ తమ అధినేత ఓపిగోయంక ఆయన సతీమణి సీమా గోయంక వారి తనయులు సునీల్ గోయంక సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తమ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు అపన్నహస్తం అందించమన్నారు. వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణాజిల్లా వాసులకు అండగా నిలవాలని సంకల్పంతో వారికి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు తమ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు తాసిల్దార్ హెచ్ ఆర్ సత్యనారాయణ, మేనేజర్లు వేమల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి,3 ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.