High Court Order:15 రోజుల్లోగా ఐటీడీఏ కేసులన్నింటినీ కలెక్టర్ కు బదిలీ చేయాలి…

సిరా, న్యూస్: ఆదిలాబాద్:

15 రోజుల్లోగా ఐటీడీఏ కేసులన్నింటినీ కలెక్టర్ కు బదిలీ చేయాలి…

+ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ఐటీడీఏ, ఉట్నూర్ పిఓ కోర్టులో పెండింగ్ లో ఉన్న సుమారు 600 నుండి 800 ఏజెన్సీ సివిల్ కేసులను 15 రోజుల్లోగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ఏజెన్సీ రూల్స్, 1924 ప్రకారం, ఐటీడీఏకు ఏజెన్సీ సివిల్ దావాలను విచారించే, అధికారం లేదని గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ, ఐటీడీఏకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఫైల్ నెంబర్.A4/CPC/9685/2022 లో ఐటీడీఏ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ, పిటిషనర్ దోని అశోక్ తరపున ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సోమ రవి కిరణ్ రెడ్డి హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు, పిటిషనర్ కేసును వెంటనే ఆదిలాబాద్ కలెక్టర్ బదిలీ చేయడంతో పాటు వీలైనంత త్వరగా కేసును పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఐటిడిఏ వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని ఏజెన్సీ సివిల్ కేసులను ఆయా జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా బదిలీ చేయాలని పేర్కొంది. దీంతో గత కొన్ని ఏళ్లుగా ఐటీడీఏ వద్ద పెండింగ్ లో ఉన్న కేసులు ఉమ్మడి జిల్లాల్లోని ఆయా కలెక్టర్లకు బదిలీ కానున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *