సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆల్ఫోర్స్ విఎన్ఆర్ అద్వర్యంలో పుస్తకాలు పంపిణి…
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి అధ్వర్యం లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో పలువురు అభ్యర్థులకు పోటిపరీక్షలకు సంబంధించినా పుస్తకాల ను జిల్లా ఇంచార్జి గోనే రవి బుదవారం అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు…. నిరుద్యోగులు, విద్యార్థుల కష్టాలు తెలిసి, అవసరం అయిన వారికి పుస్తకాలను ఉచితంగా అందచేయడం జరిగిందన్నారు. గతంలో కూడా లైబ్రరీలో లో కూర్చీలు, స్టడీ ప్యాడ్లు, మంచి నీటి ట్యాంక్తో పాటు 54 పోటీ పరీక్షలకు అవసరం అయినా ఉచిత యాప్ ను అందచేయడం జరిగిందన్నారు. ఆయన వెంట నాయకులు మామిడి మల్లా రెడ్డి, తదితరులు ఉన్నారు.