విధుల్లో కొనసాగించాలని సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది ధర్నా

 సిరా న్యూస్,పెద్దపల్లి;
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా సేవలందిస్తున్న వారిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుండి తప్పించడం పట్ల బుధవారం జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని విరమించుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్శకు వినతిపత్రం అందజేశారు. అధికారుల మనసు మార్చి తాము విధుల్లో కొనసాగేలా చేయాలని పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల వలె విద్యార్థులకు సేవలందిస్తూ కష్టపడుతున్నా మని, విద్యా సంవత్సరం మధ్యలో తమని విధులు నుండి తీసివేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయంతో మా జీవితాలు రోడ్డు పాలయ్యాయని, మానవతా దృక్పథంతో వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అరవింద్, సురేష్, రమేష్, శ్రీనివాస్, రవీందర్, ఆనంద్, లింగయ్య, రామకృష్ణారెడ్డి, ఏ. శ్రీనివాస్, రాజమౌళి, సంతోష్, ధర్మాచారి, ఏం.శ్రీనివాస్, దేవదాసు, రాజేష్, అనిల్, లింగయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *