తాజా వార్తలు

ప్రతి కుటుంబంపై లక్ష రూపాయల అప్పు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో అప్పుల గురించి నాబార్డ్‌ సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆదాయం పెరిగినా మిగులు తగ్గుతుందని నాబార్డ్ సర్వేలో తేలింది. అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని నాబార్డ్ తేల్చి చెప్పింది. ఒక్కో కుటుంబంపై అప్పు భారం లక్షకు పైనే ఉంది.తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున లక్షా 29 వేల 599 రూపాయల అప్పు ఉంది. నాబార్డ్‌ ఆల్‌ ఇండియా రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది. తెలంగాణలోని ఒక్కో కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.7,811 నుంచి రూ.12,065కి పెరిగింది. జాతీయ సగటు రూ.8,059 నుంచి రూ.12,698కి చేరిందని నాబార్డ్ సర్వే వెల్లడించింది.తెలంగాణలో వ్యవసాయ కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.8,951 నుంచి…

Read More
14 Oct 2024, 4:24 pm
Updated: 14 Oct 2024, 4:24 pm
siranews.in