
పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం
శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యం కేసు మాఫీకి పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి నిందితుడి భార్య టీడీపీ పట్టణ అధ్యక్షురాలు సిరా న్యూస్,పిఠాపురం; కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మేనత్త వేమగిరి మరియమ్మ ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత, భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు. ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయం త్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలి కను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని నిందితుడు డంపింగ్…
