పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం

శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యం
కేసు మాఫీకి పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి
నిందితుడి భార్య టీడీపీ పట్టణ అధ్యక్షురాలు
 సిరా న్యూస్,పిఠాపురం;
కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మేనత్త వేమగిరి మరియమ్మ ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత, భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు. ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయం త్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలి కను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని నిందితుడు డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్ ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్ ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కావడంతో ఇది సంచలనంగా మారింది మంగళవారం ఈ ఉదంతంతో వెలుగులోకి రావడంతో దీనిపై ఆందోళన మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *