సిరా న్యూస్, భీమదేవరపల్లి
వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్
* బొల్లోనిపల్లి లో వృద్దులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం
వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ అన్నారు.మంగళవారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ, మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో వృద్దులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా 72 మందికి షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ బొల్లోనిపల్లి గ్రామంలో ప్రజలకు బీపీ, షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగిందని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామాలలోని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రెస్ గ్రామ అధ్యక్షులు బొల్లి సుమన్, రెడ్ క్రాస్ డాక్టర్లు : డా. జె. కిషన్ రావు, డా. మొహమ్మద్ తహర్ మసూద్, రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, క్రాంతి, సతీష్ , జక్కోజు నరసింహ చారి, పోశాలు, కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ , గోనెల సంపత్, పొన్నం వనజ, గ్రామస్తులు పి. గోపాల్ రావు, గోవింద రావు, మేడబోయిన పద్మ పాల్గొన్నారు. ఈ ఆరోగ్య శిబిరంలో 72 మందికి షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులు హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం కు కృతజ్ఞతలు తెలిపారు.