Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 9 October 2024, 5:33 pmEditor : SIRA NEWS
BRS Bhukya Johnson Naik: దుర్గా దేవి పూజలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్

సిరాన్యూస్, పెంబి
దుర్గా దేవి పూజలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని దుర్గామాత వద్ద పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోజాన్సన్ నాయక్‌ను శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు.ఈ సంధర్బంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి దైవ కార్యక్రమం ఉన్నా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దుర్గామాత ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
