
Charitable Trust Badde Naik: బాధితుడు దుర్గన్నకు రూ.15వేల అందజేత: ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
సిరాన్యూస్,కుందుర్పి బాధితుడు దుర్గన్నకు రూ.15వేల అందజేత: ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ కిడ్నీ ఇన్ఫెక్షన్ బాధితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సాయం అందజేసి చేయూత అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామానికి చెందిన దుర్గన్న(42) కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు.దుర్గన్నది నిరుపేద కుటుంబం భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు రోజు వారి కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నా వేళ కుటుంబ పెద్ద అయినా దుర్గన్న అనారోగ్యపాలయ్యారు. అనేక ఆసుపత్రులు తిరిగి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకొని చివరగా డాక్టర్ల సూచన మేరకు బెంగళూరులోని సెయింట్ జాన్ ఆసుపత్రిలో 12రోజుల నుండి చికిత్స పొందుతున్నారు. మందులు తదితర వాటి కోసం రోజుకు 10వేల వరకు ఖర్చు అవుతోంది.చికిత్స కోసం చేతిలో చిల్లి…
