సిరాన్యూస్,కుందుర్పి
బాధితుడు దుర్గన్నకు రూ.15వేల అందజేత: ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
కిడ్నీ ఇన్ఫెక్షన్ బాధితుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సాయం అందజేసి చేయూత అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామానికి చెందిన దుర్గన్న(42) కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు.దుర్గన్నది నిరుపేద కుటుంబం భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు రోజు వారి కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నా వేళ కుటుంబ పెద్ద అయినా దుర్గన్న అనారోగ్యపాలయ్యారు. అనేక ఆసుపత్రులు తిరిగి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకొని చివరగా డాక్టర్ల సూచన మేరకు బెంగళూరులోని సెయింట్ జాన్ ఆసుపత్రిలో 12రోజుల నుండి చికిత్స పొందుతున్నారు. మందులు తదితర వాటి కోసం రోజుకు 10వేల వరకు ఖర్చు అవుతోంది.చికిత్స కోసం చేతిలో చిల్లి గవ్వ లేక,ఎక్కడ అప్పు కూడా పుట్టక ఇబ్బంది పడుతున్నప్పుడు గ్రామ యువకుల సలహాతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బద్దేనాయక్ సంప్రదించారు. మాకొడికి పాఠశాలలో విరామ సమయంలో దుర్గన్న సోదరుడు చౌడప్పకు 15,000/- నగదును అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారుజ. ఆపదలో ఉన్న మా సోదరుడు దుర్గన్నను ఆదుకున్నందుకు చౌడప్ప కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాకొడికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ఉపాధ్యాయులు ఉమాపతి, నాగిరెడ్డి పాల్గొన్నారు