సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
అయ్యప్ప స్వామీ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ : ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన. శ్రీ. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి నూతన ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే విజయరమణ రావు భూమి పూజ చేశారు. అనంతరం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ ఈ దేవాలయంను అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్దలతో నిర్మాణపనులను సంవత్సరం లోపల పూర్తి చేయాలన్నారు. నా జన్మదిన సందర్బంగా ఈ పూజ లో పాల్గొనడం అదృష్టం అన్నారు. శ్రీ బసవత్తుల రాజమౌళి స్వామీజీ మాట్లాడుతూ ఈ అయ్యప్ప మాల భక్తి శ్రద్దలతో కుల మతాలకు అతీతంగా మాల ధరించి కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. కనుక దేవాలయం ఉంటే అందరు ప్రజలు భక్తులు దర్శించుకోవచ్చు తెలిపారు. అందరు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం అన్నారు. కార్యక్రమంలో ఆచార్య శ్రీ బసత్తుల రాజమౌళి స్వామిజీ, మాజీ అయ్యప్ప భక్తులు, పి. వీరారెడ్డి, టీ.ప్రసాద్, సంబశివారెడ్డి.ఓ. కొమురయ్య.టీ. రవి, దేవేందర్, తిరుపతి రెడ్డి,డాక్టర్ కుమార్ఎం, పీపీ సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు .అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.