సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా ఎమ్మెల్యే విజయరమణ రావు జన్మదిన వేడుకలు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం శ్రీరాంపూర్ కేంద్రంలోని ఉన్న నిరుపేద చెంచుకులస్తులకు స్థానిక నాయకులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయరామణారావు కు శుభాకాంక్షలు తెలియజేసి బాణాసంచాలు పేల్చారు. కార్యక్రమంలో మాజీ ఎం పి పి. గోపగోని సారయ్య గౌడ్. మాజీ జెడ్ పి టీ సి. లంక సదయ్య. మండల అధ్యక్షులు గజవేనా సదయ్య యాదవ్.సింగల్ విండో చైర్మన్ చదువు రాంచెంద్రారెడ్డి. మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి,మాజీ సర్పంచ్ మదాసి సతీష్.అల్లంల దేవేందర్, రానవేనా శ్రీనివాస్, బంగారి రమేష్.సోనాయితేంకం శివరామకృష్ణ.మెట్టు శ్రీశైలం, ఎనగంటి రవి, కల్వలా శ్యామ్, మాజీ సర్పంచ్ శ్రీపతి మొగిలయ్య గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.