తాజా వార్తలు

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

- అంగన్వాడీలు, కేజీబీవీ సిబ్బందికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భరోసా.. - ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరిపై మండిపాటు.. సిరా న్యూస్,శ్రీకాకుళం; డిమాండ్ల సాధనకు సమ్మె బాట పట్టిన అంగన్వాడీ ఉద్యోగులు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల సిబ్బందిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఉదాసీన వైఖరి వదిలి, ఉద్యోగుల సంక్షేమానికా కృషి చేయాలని హితవు పలికారు. ఉద్యోగులకు తనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు, కేజీబీవీ చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. వారికి సంఘీభావం తెలిపి, మాట్లాడారు. గత 18 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 10 వేలమంది ఉద్యోగులు రోడ్డు పైనే ఉన్నారని…

Read More
30 Dec 2023, 6:58 pmsiranews.in