
విజయదశమి రోజున జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధం.
దేవర గట్టు సిరా న్యూస్,కర్నూలు; కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని దేవరగట్టు ఉత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు అధికార యంత్రాంగం చేసింది. దేవరగట్టులో యధావిధిగా పూజలు,కళ్యాణం, భవిష్యవాణి జరుగుతాయి. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న .ఎంతో ఆసక్తి కరంగా సాగే దేవరగట్టు ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 12 అర్ధరాత్రి జరిగే బన్నీ(కర్రల సమరం )నియంత్రణకై పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు,తపస్సులు చేస్తు ప్రశాంత జీవనం గడిపేవారని అదే ప్రాంతంలో మని మని..మల్లసూరులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ లోక కల్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజ కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారని వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారని..మిమల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు…
