
Farmers Training: పసుపు రైతులు సంఘటితం కావాలి…
సిరా న్యూస్, ఖానాపూర్: పసుపు రైతులు సంఘటితం కావాలి... పసుపు రైతులంతా సంఘటితమై, సంఘాలుగా ఏర్పడితే ఎన్నో లాభాలు పొందవచ్చని సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్, సీనియర్ అధికారి రాజామాణిక్యం అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలం సత్తన్ పల్లి గ్రామంలోని రైతు వేదికలో ఆదిలాబాద్ గిరిజన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపు నాణ్యత ప్రమాణాలు, సాగు యాజమాన్య పద్ధతులు, మెలకువలు, పంట కోత యాజమాన్య పద్ధతులు, పంట కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు, పసుపు యొక్క నూతన వంగడాలు, సాంకేతిక పద్ధతులు, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే పద్ధతులు, రైతు ఉత్పత్తిదారులకు ఇచ్చే సబ్సిడీలు, వివిధ పథకాల గురించి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెటింగ్ అవకాశాలు,…
