
ప్రాచీన ఆలయాల్లో మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు పూజలు
సిరా న్యూస్,మంథని; మంథని పట్టణం లోని అతి ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ భారత మాజీ క్రికెటర్ వేంకటపతి రాజు దంపతులు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని హనుమాన్ , ఓంకారేశ్వర, బిక్షేశ్వర, మహాలక్ష్మి, గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రముఖ భారత మాజీ క్రికెటర్ తెలుగు వాడైన వెంకటపతి రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా వెంకటపతి రాజు మాట్లాడుతూ...మంథని కి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ దేవాలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేవుని నమ్ముకోవాలని పూజలు చేసుకోవాలని మనకి ఏది ఇష్టం ఉందో అది చేయాలన్నారు. తరాలు మారుతున్నాయని ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఎంతో బాగుండేవని కాలానికి అనుగుణంగా మనం కూడా కొంత మారాల్సి ఉంటుంది అన్నారు. లైఫ్ ఎంజాయ్ చేయాలన్నారు. ఒకప్పుడు టి20 మ్యాచ్ లు…
