ప్రాచీన ఆలయాల్లో మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు పూజలు

సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణం లోని అతి ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ భారత మాజీ క్రికెటర్ వేంకటపతి రాజు దంపతులు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని హనుమాన్ , ఓంకారేశ్వర, బిక్షేశ్వర, మహాలక్ష్మి, గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రముఖ భారత మాజీ క్రికెటర్ తెలుగు వాడైన వెంకటపతి రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా వెంకటపతి రాజు మాట్లాడుతూ…మంథని కి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ దేవాలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేవుని నమ్ముకోవాలని పూజలు చేసుకోవాలని మనకి ఏది ఇష్టం ఉందో అది చేయాలన్నారు. తరాలు మారుతున్నాయని ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఎంతో బాగుండేవని కాలానికి అనుగుణంగా మనం కూడా కొంత మారాల్సి ఉంటుంది అన్నారు. లైఫ్ ఎంజాయ్ చేయాలన్నారు. ఒకప్పుడు టి20 మ్యాచ్ లు ఉండేవి కాదని టెస్ట్ మ్యాచ్ లు ,వన్డే లు మాత్రమే ఉండేవని, అప్పుడు మ్యాచ్లు తక్కువ ఉందని అందరూ మ్యాచ్ ల కోసం వేచి చూసే వారిని , చాలా దూరం నుంచి వచ్చి మ్యాచ్ ఎంజాయ్ చేసి రికార్డ్స్ ను పెట్టుకునే వారన్నారు.ప్రస్తుతం యంగ్ జనరేషన్ లో సోషల్ మీడియా లో అన్నీ దొరుకుతున్నాయి. టి20 మ్యాచ్ లు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికైనా టెస్ట్ క్రికెట్ టెస్ట్ క్రికెటే అని పేర్కొన్నారు. ఒకప్పుడు జాబ్ గురించి క్రికెట్ ఆడే వాళ్ళమని ప్రస్తుతం క్రికెట్ ఒక జాబ్ గా అయిందన్నారు. క్రికెట్ పెరగాలంటే చిన్న దేశాలు ఇంకా బాగా ఆడాలన్నారు.
అనంతరం మంథని కి చెందిన అన్నదమ్ములైన ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్స్ మహావాది సుదీర్, మహావాది విజయ్ ల తల్లి గారు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని వెంకటపతి రాజు దంపతులు పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *