సిరాన్యూస్, ఓదెల
నిమజ్జనానికి పటిష్ట భద్రత : సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గణపతి నవరాత్రులు ముగించుకొని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి సూచించారు. సోమవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి. అశోక్ రెడ్డి.ఏఎస్ఐ ఎస్. సుధాకర్.హెడ్ కానిస్టేబుల్ సుధాకర్. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.