Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 8 October 2024, 3:20 pmEditor : SIRA NEWS

Gangam Duttu Reddy: మహిళకు రక్తదానం చేసిన గంగం దత్తు రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
మహిళకు రక్తదానం చేసిన గంగం దత్తు రెడ్డి
* ర‌క్త‌దాత‌కు, సామ రుపేష్ రెడ్డికి కుటుంబ స‌భ్యుల కృత‌జ్ఞ‌త‌లు

గత కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అదిలాబాద్ మండలంలోని బీంసరి గ్రామానికి చెందిన తులసి గంగమ్మ అనే మహిళకు ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి ఆధ్వర్యంలో యువకుడు రక్తదానం చేశారు.ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితురాలికి వైద్యులు బి పాజిటివ్ రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు.వెంటనే వారు అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిని సంప్రదించగా ఆయన వెంటనే జైనాథ్ మండలం కూర గ్రామానికి చెందిన గంగం దత్తు రెడ్డి అనే యువకుడితో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయించారు.దీంతో అత్యవసర సమయంలో స్పందించిన సామ రుపేష్ రెడ్డి తో పాటు యువకుడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో ఎండి అఖిల్ తో పాటు కుటుంబ సభ్యులు వంశీ తదితరులు ఉన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.