
Gold at half price. సగం ధరకే బంగారం.
కొత్త మోసం సిరా న్యూస్, కరీంనగర్; రోజుకో రకంగా జనాలను మాయ చేసి మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కేటుగాళ్లు. వారి ప్లాన్‌కు తగ్గట్టుగానే ఎప్పుడూ ఎవరో ఒకరు బకరా అవుతున్నారు. తాజాగా సగం ధరకే బంగారం ఇచ్చేస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తూ ఓ బెంగళూరు గ్యాంగ్ బురిడీ కొట్టిస్తోంది. ఈ వ్యవహారం జగిత్యాలలో బయటపడింది. 82960 09383, 88670 24793 ఈ ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోండి.. ఇల్లు కడుతుండగా బంగారం దొరికిందని, సగం రేటుకే దాన్ని ఇచ్చేస్తున్నామని అంటూ జనాలకు ఫోన్ చేసి వల వేస్తోంది బెంగళూరుకు చెందిన ఓ గ్యాంగ్. అందినకాడికి దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేసిన ఆ గ్యాంగ్.. జనాన్ని నమ్మించేందుకు కొన్ని బంగారం ఫొటోలను వాట్సాప్‌లో కూడా పంపిస్తోంది.జగిత్యాల జిల్లా జాబితాపూర్, హబ్సీపూర్, కల్లెడ, అనంతారం, ధర్మారం, లక్ష్మీపూర్ గ్రామాలలో చాలామందికి ఇలా ఫోన్లు,…
