
శబరిమలైలో భారీగా రద్దీ Heavy traffic in Sabarimalai
సిరా న్యూస్,తిరువనంతపురం; శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. 40 రోజుల్లో శబరిమలకు 204 కోట్ల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 64 కోట్లు వచ్చినట్టు ట్రావెన్ కోర్ ప్రకటించింది. మరోవైపు వర్చువల్ క్యూ బుకింగ్‌ల సంఖ్య 90 వేలు దాటింది. స్పాట్ బుకింగ్‌లతో దాదాపు 10,000 మంది భక్తులు రావడంతో రానున్న రెండు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు శబరిమలకు రానున్నారు. దీంతో పాటు దాదాపు 20 వేల మంది ఎలాంటి బుకింగ్ లేకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15గంటలకు పైగా సమయం పడుతోంది.మరోవైపు రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.-…
