తాజా వార్తలు

హైదరాబాద్ వ్యర్ధం… నల్గోండ తీర్ధం

మూసి బచావో అంటున్న నల్గోండ వాసులు సిరా న్యూస్,హైదరాబాద్; అనంతగిరి కొండలు అరుదైన వనమూలికల సంపదతో తలతూగుతున్నాయి. అక్కడి గాలి పీల్చితే చాలు రోగాలన్నీ మాయమవుతాయని ఎంతోమంది నమ్మకం. ఆ వనమూలికల కొండల్లోనే మూసీ నదిపుట్టింది. అక్కడినుంచి దాదాపు 240 కిలోమీటర్లు ప్రయాణించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నీరు తాగేందుకు ఎంతో విశిష్టమైనదిగా భావించేవారు. కానీ, నేడు మూసీ నది అంటేనే మురికి నీరుగా మారిపోయింది. ఇక ఈ నీరు తాగేందుకు కాదు కదా కనీసం పంటపొలాలకు కూడా వాడటం ప్రమాదకరంగా మారుతున్నది. నల్లగొండ మీదుగా ప్రవహించే మూసీ నదిలోకి నీళ్లు వచ్చాయంటే.. ఆ పరివాహక ప్రాంత రైతులకు ఆందోళన మొదలవుతుంది. ఆ నది ఎన్ని రసాయన వ్యర్థాలను తీసుకువచ్చిందో.. ఆ నీటితో తమ పంటలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని…

Read More
11 Oct 2024, 12:22 pmsiranews.in