
మూసి బ్యూటిఫికేషన్ సాధ్యమేనా….
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో పది నెలల క్రితం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొలువుదీరిని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేస్తామని ముందుకు వచ్చింది. ఇందుకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకు దేశంలోనే అతి పొడవైన గంగా నది ప్రక్షాళనకు కూడా ఇంత భారీగా నిధులు ఖర్చు చేయలేదు. నమామి గంగే పేరుతో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజక్టులన్నీ విఫలమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో లక్షన్నర కోట్లకుపైగా ఖర్చు చేసినా మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విఫలమైతే కాళేశ్వరం తరహాలోనే భారీగా నిధిలో మూసీలో పోసినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. శాస్త్రీయ అధ్యయనం, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ముందస్తుగా పూర్తి చేయకుండా…
