
జగన్ ఒంటరి….
జాతీయ పార్టీల నుంచి డోర్లు క్లోజ్ సిరా న్యూస్,న్యూఢిల్లీ; ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసిన వైసీపీ చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి తర్వాత సీనియర్లు పార్టీని వీడుతూ జగన్ ఒంటరి అవుతున్నారు. ఒక వైపు అక్రమాస్తుల కేసులు , మరో వైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకు పెను సవాల్‌గా మారాయి. ఉన్న కష్టాలకు తోడు శ్రీవారి లడ్డు వివాదం వైసీపీ మెడకు చుట్టుకుని ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తుంది. ఆ ఎఫెక్ట్‌తో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదెలా అంటారా? మీరే చూడండి.సింహం సింగిల్‌గా వస్తుంది. ఆ సినిమా డైలాగ్‌ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సైన్యం పదేపదే రిపీట్ చేస్తుంటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ నిజంగానే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో సీనియర్లు ఒకరొకరుగా…
