
ఎడిటోరియల్ మార్చుకుందాం….
మోడీకి షాకిచ్చిన కశ్మీరం... సిరా న్యూస్; వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్ ఎలక్షన్స్ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణంచేపట్టినా, ఆర్టికల్ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది..రామ మందిరాన్ని కట్టించి హిందువుల చిరకాల కోరికను నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. అవాంతరాలు, అడ్డంకులు..కోర్టు కేసులు..వివాదాలు అన్నీ ఒక్కొటిగా దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తి చేశారు. రాముడి ప్రతిష్ఠ జరిపారు. దేశమంతా హ్యాపీ అనుకున్నారు. ఇది చూసిన హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికిందని సంతోష పడ్డారు. రామ మందిరం నిర్మాణం పూర్తి చేశామన్న ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు…
