తాజా వార్తలు

MLA Vijayaramana Rao: నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరాన్యూస్‌, ఓదెల నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సేవలను ప్రారంభించామ‌ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.కరీంనగర్ నుండి ప్రారంభమై పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రూపునారాయణపేట, శానగొండ, పాత్కపల్లి గ్రామాల మీదుగా సుల్తానాబాద్, జమ్మికుంట వరకు బస్సు రవాణా సదుపాయాన్ని గురువారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు కి గ్రామస్తులు, నాయకులు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం రేవంత్ రెడ్డి సర్కార్ తోనే సాధ్యమైందని…

Read More
10 Oct 2024, 2:31 pmsiranews.in