సిరాన్యూస్, ఓదెల
నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సేవలను ప్రారంభించామని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.కరీంనగర్ నుండి ప్రారంభమై పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రూపునారాయణపేట, శానగొండ, పాత్కపల్లి గ్రామాల మీదుగా సుల్తానాబాద్, జమ్మికుంట వరకు బస్సు రవాణా సదుపాయాన్ని గురువారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు కి గ్రామస్తులు, నాయకులు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం రేవంత్ రెడ్డి సర్కార్ తోనే సాధ్యమైందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. రూపునారాయణపేట, గొల్లపల్లి గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం లేదని ప్రజలు నా దృష్టికి తీసుకురాగా హుజురాబాద్ డిపో మేనేజర్ తో మాట్లాడి జమ్మికుంట గుంపుల మీదుగా ఇందుర్తి, బయమ్మపల్లి, శానగొండ, గొల్లపల్లి, రూపునారాయణపేట మీదుగా పాత్కపల్లి, మడక కనగర్తి మీదుగా సుల్తానాబాద్, కరీంనగర్ బస్టాండుకు చేరుకుంటుందన్నారు. బస్సు సౌకర్యాన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దసరా తర్వాత రూపునారాయణపేట, బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోని రెండు సంవత్సరాలలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటామని తెలిపారు. రూపునారాయణపేట, గొల్లపల్లి మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు సర్వే నిర్వహించారని త్వరలోనే ఫ్లైఓవర్ పనులు ప్రారంభం అవుతుందన్నారు. మారుమూల గ్రామాల్లోని ఉన్న ప్రజలందరికీ రవాణా సౌకర్యం సులభతరం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ప్రారంభించిన నూతన బస్సులో మొదటి టికెట్ తీసుకొని కొంత దూరం ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రయాణించారు. కార్యక్రమంలో ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అంకం రమేష్ ,అంబాల కొమురయ్య, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.