ఆంధ్రప్రదేశ్

జగన్ ను అడ్డంగా బుక్ చేసిన ఎన్డీయే

సిరా న్యూస్,విజయవాడ; తిరుమల లడ్డూ వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారితీస్తోంది. జాతీయస్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారని వివాదం రేగిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఈ ఆవు నెయ్యిని ఏఆర్ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. గత జూలైలో ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ లో కల్తీ జరిగిందని నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని వార్తలు బయటికి రావడం మొదలయింది. వాస్తవానికి ఇలాంటి విషయాలు టిటిడి ఈఓ చెబుతారు. అయితే…

Read More
23 Sep 2024, 11:08 amsiranews.in