
మార్చి 10న నోటిఫికేషన్
సిరా న్యూస్,విజయవాడ; వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది. గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనట్టేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 20 రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు హడావిడి చూస్తుంటే నిజమేనని తేలుతోంది.తెలంగాణలో సైతం ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ క్షణంలో నైనా ఎన్నికలు…
