
గ్రూప్ వన్ వాయిదా… ఆందోళనలు దేనికి…
పరీక్షా పే చర్చతో లాభం ఎవరికి.. నష్టం ఎవరికి సిరా న్యూస్,కరీంనగర్; పరీక్షల చుట్టూ జరుగుతున్న రచ్చను ఒక్కొక్కటిగా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. గ్రూప్ 2 వాయిదా వేయాలన్నారు. వాయిదా వేసేశారు. మొన్నటికి మొన్న డీఎస్సీ వాయిదా వేయాలన్నారు. చివరి దాకా ప్రయత్నాలు జరిగాయి. ఒత్తిడి పెంచారు. ఆందోళనలు చేశారు. కానీ ప్రభుత్వమే చాలా సీరియస్ గా తీసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. టైంకు రిజల్ట్ ఇచ్చింది. నియామకపత్రాలు కూడా ఇచ్చేశారు. కొత్త టీచర్లు అప్పుడే డ్యూటీలు ఎక్కేశారు. పిల్లలకు పాఠాలు చెబుతున్నారు కూడా. ఆ పది వేల మంది కళ్లల్లో, వారి ఇళ్లల్లో, కుటుంబాల్లో ఆనందం అంతా ఇంతా కాదు.నిజానికి ఇదే డీఎస్సీ వాయిదా పడి ఉంటే అసలు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉండేది. వీరంతా అలా నిరుద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రతి…
