
నెయ్యి సరఫరాదారులపై చర్యలకు సిద్ధం
సిరా న్యూస్,విజయవాడ; తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వుల అవశేషాలు వెలుగు చూశాయని, అక్రమాలు జరిగాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ఎన్డీఏ వంద రోజుల పాలన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతపై నిర్వహించిన పరీక్షల్లో దిగ్బ్రాంతి పరిచే వాస్తవాలు వెలుగు చూసినట్టు గురువారం టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నివేదికలను విడుదల చేశారు.జూలై నెల మొదటి వారంలో తిరుమలలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ ఆధారంగా గుజరాత్‌కు చెందిన నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ అనుబంధ కాఫ్‌లో తిరుమలలో సేకరించిన నెయ్యి పరీక్షలు జరిపారు. దీనిపై కలవరపెట్టే విషయాలు వెలుగు చూశాయి. నెయ్యి తయారీకీ అవసరమైన ఎస్ వాల్యూ 95.8-104.32 శాతం మధ్య ఉండాల్సి ఉండగా టీటీడీ నుంచి సేకరించిన…
