
కరీంనగర్ మ్యూజియంలో ఆదిమానవుల ఆయుధాలు
సిరా న్యూస్,కరీంనగర్; సామాన్యంగా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చరిత్ర కట్టడాలు దేశ కళా సంపద ఆదిమానవుల కాలంలో ఎలా ఉండేవారు, రాజుల కాలంలో ఇలాంటి నాణేలు ఉండేవి, బ్రిటిష్ కాలంలో ఎలాంటి నాణాలుఉండేది, రాజులు యుద్ధ సమయంలో ఇలాంటి ఆయుధాలు వాడారు, ఆహార పదార్థాలు ఎలా ఉండేవి, భారతదేశ వివిధ ప్రాంతాల్లో ఉండే విలువైన కల సంపదలను అవగాహన కల్పించేందుకు విద్యార్థులను ఎక్స్కర్షణ్ పేరుతో విహారయాత్రలకు తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో ఉండే మ్యూజియంలను సందర్శించి అవగాహన కల్పించేవారు.కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత పరిజ్ఞానం పెరిగే కొద్దీ నేటి యువత సోషల్ మీడియాకు బానిసలు అవుతూ ఈ కళా సంపద, ఒకప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే పురాతనమైన అద్భుత కట్టడాలు వాటి విలువలను తెలుసుకోవడం మానేశారు.మనదేశంలో కళాకారుల యొక్క కళ,…
