సిరా న్యూస్,కరీంనగర్;
సామాన్యంగా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చరిత్ర కట్టడాలు దేశ కళా సంపద ఆదిమానవుల కాలంలో ఎలా ఉండేవారు, రాజుల కాలంలో ఇలాంటి నాణేలు ఉండేవి, బ్రిటిష్ కాలంలో ఎలాంటి నాణాలుఉండేది, రాజులు యుద్ధ సమయంలో ఇలాంటి ఆయుధాలు వాడారు, ఆహార పదార్థాలు ఎలా ఉండేవి, భారతదేశ వివిధ ప్రాంతాల్లో ఉండే విలువైన కల సంపదలను అవగాహన కల్పించేందుకు విద్యార్థులను
ఎక్స్కర్షణ్ పేరుతో విహారయాత్రలకు తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో ఉండే మ్యూజియంలను సందర్శించి అవగాహన కల్పించేవారు.కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత పరిజ్ఞానం పెరిగే కొద్దీ నేటి
యువత సోషల్ మీడియాకు బానిసలు అవుతూ ఈ కళా సంపద, ఒకప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే పురాతనమైన అద్భుత కట్టడాలు వాటి విలువలను తెలుసుకోవడం మానేశారు.మనదేశంలో కళాకారుల యొక్క కళ, దేశ సంపద, చరిత్రకారుల చరిత్ర, పురాతనమైన కట్టడాలు, ఆదిమానవులు ఆనాటి కాలంలో వాడిన ఆయుధాలు, చరిత్ర చెదిరిపోకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురావస్తు శాఖ వారు మ్యూజియం లు ఏర్పాటు చేశారు. నేటికీ ఎన్నో లక్షల సంవత్సరాల కాలం నాటి ఆదిమానవులు వాడినటువంటి ఆయుధాలు పురాతనమైన నానాలు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన శిల్పకళ, రాజులు కాలం నాటి ఆయుధాలు పురవస్తు శాఖ వారు భద్రపరిచి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారుఅయితే నేటికీ దేశంలో ఏదో ఒకచోట ఏదో ఒక రకమైన చరిత్ర కట్టడాలు పురాతనమైన నాణ్యాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటకు వస్తూనే ఉన్నాయి… కానీ… ఎంతో విలువైన ఈ సంపదలను వీక్షించేందుకు అయితే కొన్ని ప్రాంతాల్లో యువత ముందుకు రావడం
లేదు. అలాంటి ప్రాంతంలో ఒకటి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మ్యూజియం అని చెప్పవచ్చు. కరీంనగర్ కేంద్రంలో పురవస్తు శాఖ వారు ఏర్పాటుచేసిన మ్యూజియం 1969లో స్థాపించారు. జాతిపిత మహాత్మా గాంధీ 100వ పుట్టినరోజు పురస్కరించుకొని గాంధీ సెంటినరీ మ్యూజియం పేరుతో మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కరీంనగర్ కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉండే ఈ మ్యూజియంలో ఆదిమానవుల కాలం నాటి సుమారు నాలుగు లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వాడినటువంటి ఆయుధాలు ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. రాజుల కాలంలో యుద్ధం సమయంలో వాడే ఆయుధాలు బ్రిటిష్ కాలంలాటి రాగి నాణాలు, గాజు నాణేలు ఇక్కడ భద్రపరిచారు. లక్ష సంవత్సరాల నాటి చాప అచ్చు, పూర్వకాలంలో వందల ఏళ్ల క్రితం నాటి రాతి శిల్పాలు ఇక్కడ నెలకొన్నాయి.రాజుల కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు వారు ఆహారం తినేందుకు ఎంతో ఖరీదైన లోహంతో తయారు చేయించిన పాత్రలు నీరు తాగేందుకు పాత్రలు ఇతర దేశాల నుంచి తెప్పించినవి కూడా
కరీంనగర్ మ్యూజియంలో భద్రపరిచి ప్రదర్శించి ఉన్నాయి. కానీ ఎన్ని విలువైన దేశ సంపద ను వీక్షించడానికి ఎవరు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం.అయితే ఇప్పటికైనా మన దేశ కళా సంపద దేశ కళాకారుల యొక్క నైపుణ్యం పురాతన కట్టడాలు ఆదిమానవుల వాడినటువంటి ఆయుధాలు రాజులు బ్రిటిష్ పరిపాలనలో వాడిన యుద్ధ ఆయుధాలు వీక్షించడానికి నేటి యువత ఆసక్తి చూపుతారని మనము ఆశిద్దాం…