సిరాన్యూస్,జైనథ్
నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి : టోల్ ప్లాజా అధ్యక్షుడు అక్నూరు సంతోష్
* పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని టోల్ ప్లాజా అధ్యక్షుడు అక్నూరు సంతోష్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల్ పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద సీఐటీయూ యూనియన్ ఆద్వర్యంలో పిప్పర్ వాడ టోల్ ప్లాజా కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్,కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పిప్పర్ వాడ టోల్ ప్లాజా యూనియన్ అధ్యక్షుడు అక్నూరు సంతోష్ మాట్లాడుతూ కేంద్రం తీసుకు వచ్చిన కార్మిక చట్టాలు కార్మికులను అణచివేసేలా ఉన్నాయన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్పు చేయడం దుర్మార్గమన్నారు. లేబర్‌కోడ్స్ రద్దు కోసం రాబోయే కాలంలో మరిన్ని ఐక్యపోరాలకు సిద్దం కావాలని దేశవ్యాప్తంగా కార్మికులను,కార్మిక సంఘాలను ఏకం చేసి మహా ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమంలో అక్నూరు సంతోష్, కార్యదర్శి విలాస్, ఉపాధ్యక్షుడు పురుషోత్తం యూనియన్ సభ్యులు పాల్గొన్నారు