సిరాన్యూస్,నాంపల్లి
ప్రతీ ఇంట్లో ఒకరికి బీజేపీ సభ్యత్వం ఉండాలి : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్
ప్రతీ ఇంట్లో ఒకరికి బీజేపీ సభ్యత్వం ఉండాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో మంగళవారం నాంపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింహ అధ్యక్షతన సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో జరుగుతున్న అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. వారిని బీజేపీ కుటుంబ సభ్యులు గా మార్చాలని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.