Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 8 October 2024, 12:38 pmEditor : Sira News

వ్యాపారానికి అడ్డెందుకని..చెట్టుపై గొడ్డలి పెట్టు

* 50 ఏండ్ల వృక్షాన్ని నరికేసిన వైనం
* ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ ప్రేమికులు
 సిరా న్యూస్,హైదరాబాద్;
రాత్రికి రాత్రీ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నా జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ మీదున్న చెట్టును తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయని ఏకంగా సుమారు 50 ఏళ్ల నాటి చెట్లను నరికేసిన, లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు వృక్షాన్ని తొలగించారు. ఈ చెట్లునాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే రాత్రి సమయంలో సెలూన్, క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి అనేవ్యక్తులు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు. అంతకుముందు రోజు కేబిఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని వాళ్లను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు. ఈ దుర్మార్గానికి ఒడి గట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.