Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 7 November 2024, 6:20 pmEditor : Sira News

తెలంగాణ అంగన్వాడి టీచర్లు హెల్పర్లకు నాణ్యమైన చీరలు

మంత్రి సీతక్క
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ అంగన్వాడి టీచర్లు హెల్పర్లకు నాణ్యమైన చీరలుతెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. పలు రకాల డిజైన్ చీరలను చూపించి, నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని వారిని సీతక్క కోరారు. డిజైన్, రంగుల్లో మార్పులు చేయాలని మంత్రి కి సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి త్వరలో చీరలు పంపిణీ చేస్తామని సీతక్క తెలిపారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.