
ఈషా ఫౌండేషన్ పై హైకోర్టుకు నివేదిక….
సిరా న్యూస్,కోయంబత్తూరు; ఈషా ఫౌండేషన్.. ఆధ్యాత్మిక భావాలు ఉన్న హిందువే కాదు. వివిధ మతాలవారు, విదేశీయులకు కూడా ఈ ఫౌండేషన్ గురించి తెలుసు. తమిళనాడులోని ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగాతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ 1992లో ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో సద్గురు(జగదీష్ వాసుదేవ్) దీనిని స్థాపించారు. ఈషా యోగా కేంద్రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వలంటీర్లే దీనిని నిర్వహిస్తున్నారు. నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లియంగిరి శ్రేణిలో 150 ఎకరాల స్థలంలో దట్టమైన అడవులు, ప్రత్యేకమైన వన్యప్రాణుల అభయారణ్యంతో ఉంది. ఇది ప్రఖ్యాత శక్తి కేంద్రం భక్తి, జ్ఞానోదయం, కర్మ, క్రియ వంటి యోగా అన్ని విభాగాలను ఒకే గొడుగు క్రింద అందించడం, గురు–శిష్య సంప్రదాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తుంది.ఇదిలా…
