సిరా న్యూస్,కోయంబత్తూరు;
ఈషా ఫౌండేషన్.. ఆధ్యాత్మిక భావాలు ఉన్న హిందువే కాదు. వివిధ మతాలవారు, విదేశీయులకు కూడా ఈ ఫౌండేషన్ గురించి తెలుసు. తమిళనాడులోని ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగాతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ 1992లో ప్రారంభమైంది. ఎలాంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో సద్గురు(జగదీష్ వాసుదేవ్) దీనిని స్థాపించారు. ఈషా యోగా కేంద్రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వలంటీర్లే దీనిని నిర్వహిస్తున్నారు. నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లియంగిరి శ్రేణిలో 150 ఎకరాల స్థలంలో దట్టమైన అడవులు, ప్రత్యేకమైన వన్యప్రాణుల అభయారణ్యంతో ఉంది. ఇది ప్రఖ్యాత శక్తి కేంద్రం భక్తి, జ్ఞానోదయం, కర్మ, క్రియ వంటి యోగా అన్ని విభాగాలను ఒకే గొడుగు క్రింద అందించడం, గురు–శిష్య సంప్రదాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తుంది.ఇదిలా ఉంటే.. ఈషా ఫౌండేన్‌లో అన్నింటికీ ఫీజే. నిస్వార్థ సేవ అని సంస్థ చెబుతన్నా.. ఉచితంగా ఇక్కడ ఎలాంటి సేవలు పొందలేరు. ప్రతీ సేవకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకు డబ్బులు చెల్లించాలి. సెలబ్రిటీలను ఫౌండేషన్‌కు తీసుకువచ్చి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారం పొందుతోంది. తద్వారా ప్రతీదానికి డబ్బులు వసూలు చేస్తోంది. సినిమా నటులు, క్రీడాకారులు, విదేశీయులు ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వారు ఫౌండేషన్‌ను సందర్శించిన ఫొటోలు, అక్కడ వారు మాట్లాడిన మాటలను ఈషా వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా కొత్తవారిని ఆకట్టుకుంటోంది. శివరాత్రికి నిర్వహించే జాగరణ కార్యక్రమానికి పెద్దపెద్ద సెలబ్రిటీలను పిలిచి దానిని కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు.ఇక సద్గురు జగదీష్ వాసుదేవ్ పాదాల ఫొటోలను కూడా ఈషా ఫౌండేషన్ విక్రయిస్తోంది. ఒక ఫొటో ఖరీదు రూ.3,200గా ఉంది. ఈమేకు ఈ ఫొటో దాని ధర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా షౌండేషన్ ఆన్‌లైన్ షాప్‌లో కూడా ఈ ఫొటో ఉంది. దీనిపై చాలా మంది వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సద్గురు పాదాలను విక్రయిస్తూ ‘గురువు పాదాలకు నమస్కరించడం అనేది మంచిది. గురువుతో లోతైన బంధాన్ని ఏర్పరుస్తుంది’ అని ఈషా ఆన్‌లైన్ షాప్‌లో రాశారు. అయితే దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు నవ్వుకుంటున్నారు.ఇదిలా ఉంటే కోయంబత్తూర్‌లోని తొండముత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో 150 మంది పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు యువతులను నిర్బంధించారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాలమేరకు పోలీసులు తనిఖీలు చేశారు. మరోవైపు ఈషా ఫౌండేషన్‌పై నమోదైన కేసులపై హైకోర్టు నివేదిక కోరింది.