Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 28 October 2024, 4:53 pmEditor : SIRA NEWS
SI Ashok Reddy: రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేత : ఎస్సై అశోక్ రెడ్డి

సిరాన్యూస్, ఓదెల
రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేత : ఎస్సై అశోక్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి మాట్లాడారు. ఓదెల మండల కేంద్రానికి చెందిన యువత స్వచ్చందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారన్నారు.అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు రక్త దానం చేసిన వారికి అభినందన పత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారి రాజు, పచ్చిమట్ల శ్రీనివాస్, కొండ్ర రవీందర్, దాత రాకేష్, సూత్రాల మనోహర్, శాతాల కుమార్, పిట్టల సిద్ధూ, నాగపురి సిద్ధార్థ, దాసరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

