
బంద్ లోకి వెళ్లిన సిరిసిల్ల పార్క్
సిరా న్యూస్,కరీంనగర్; సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ బంద్ అయింది ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. గడిచిన 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని.. ఇక నడిపించే పరిస్థితి లేదని వాపోతున్నారు.వస్త్ర సంక్షోభంతో సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ బాలారిష్టాలను ఎదుర్కొంటుంది. నేసిన గుడ్డకు గిట్టుబాటు ధర లేక వస్త్ర ఉత్పత్తి చేయలేక పవర్ లూమ్ పరిశ్రమను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 6 నుంచి బద్దెనపల్లిలోని టెక్స్ టైల్ పార్క్ ను మూసివేయాలని యజమానులు నిర్ణయించారు.వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అన్నల్స్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెక్స్ టైల్ పార్క్ వస్త్రోత్పత్తి అవుతున్న వస్త్రానికి మార్కెట్లో గిట్టుబాటు ధర…
