
బీజేపీకి ఆరు… పన్నెండు
సిరా న్యూస్,విజయవాడ; ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన- బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్ క్లియర్ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసివచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్ కల్యాణ్ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే మూడు పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకరం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేన ఎక్కడ పోటీచేయాలో తమకు స్పష్టత ఉందని.. సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్లు సర్దుబాటు తర్వాతే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చనున్నట్లు సంకేతాలు పంపారు. మరోవైపు జగన్ ను గద్దె దించాలని…
