
లిక్కర్ షాపులపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మక్కువ
సిరా న్యూస్,ఏలూరు; ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా లిక్కర్ గురించే డిస్కషన్ నడుస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎక్కడ నలుగురు కలిసినా వైన్ షాపుల గురించే మాట్లాడుకుంటున్నారు. లిక్కర్ బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు టెండర్లు వేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో.. యువత వాటిని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు స్వయంగా ఎక్సైజ్ ఆఫీసులకు వచ్చి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. గతంలో…
