
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాము మేయర్ బి.వై. రామయ్య
సిరా న్యూస్,కర్నూలు; ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని మేయర్ బి.వై. రామయ్య పిలుపునిచ్చారు. *ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగము కర్నూలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి రాజ్ విహార్ వరకు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని మేయర్ బి.వై. రామయ్య జెండా ఊపి ప్రారంభించారు. *ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు.ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషిచేయాలన్నారు.ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అవగాహన లేని కారణంతో కొంతమంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు…
