
తెలంగాణలోనూ క్యాంపు రాజకీయాలు… షురూ…
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో పోలింగ్ ముగిసింది.. 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపే.. దీంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.. కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిది..? ఓటింగ్ అనుకూలంగా మారుతుందా..? వ్యతిరేకత ప్రభావం ఎంత..? ఎక్కడ ప్లస్.. ఎక్కడ మైనస్.. ఇలా అన్ని చోట్ల జరిగిన ఓటింగ్ సరళిపై అంచనాలు వేస్తూ తలామునకలవుతున్నారు.. ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ పల్స్ ఎంత ప్రభావితం చేస్తాయి.. ఏ అంచనాలు నిజమవుతాయంటూ బేరిజు వేస్తున్నారు.. అంతేకాకుండా.. గెలుపు, తమదంటే తమదంటు ప్రధాన పార్టీలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఎవరి ధీమా వారు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆరే సీఎం, బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందని మంత్రి కేటీఆర్ అంటే, తొమ్మిదో తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు…
