
విద్యార్థుల్లో సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందించడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం
-నేడు జాతీయ సేవా పథకం దినోత్సవం సిరా న్యూస్; విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ కళాశాలలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోను, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్యపర్చడంలోను ఎన్ఎస్ఎస్ వలంటీర్ల కృషి వెల కట్టలేనిది. సమాజంలో ఉన్నవారిని చైతన్యపర్చడంతో పాటు, సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుంచే అలవాటు చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు పునాదులు వేసినట్లవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే ఎన్ఎస్ఎస్లో వలంటీర్లుగా చేరతారు. జాతీయ సేవా పథకం (నేషనల్ సర్వీస్ స్కీమ్ ) భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరం ప్రారంభించబడిన యువజన కార్యక్రమం.ఈ పథకాన్ని ప్రారంభించి నేటికీ 56 సంవత్సరాలు.(సెప్టెంబర్ 24 2024),…
