
ఈ సారి చలి ఎక్కువే
సిరా న్యూస్,హైదరాబాద్; ఈ చలికాలంలో హైదరాబాద్ సహా తెలంగాణ ప్రజలు అధిక చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్టోబరు, నవంబరు మధ్య కాలంలో లా నినా కారణంగా ఈ చలికాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. భూమధ్యరేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గితే దాన్ని లా నినా అంటారు. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే లా నినా ఎఫెక్ట్ అంటారు. పసిఫిక్ మహాసముద్రం పెరూ తీరంలో ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతాయి. లా నినా తరచుగా తెలంగాణతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణానికి దారి తీస్తుంది.ఐఎండీ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది చలికాలంలో ప్రజలు వణికిపోవాల్సిందే. ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. మామూలుగా హైదరాబాద్లో ప్రతి శీతాకాలం…
