తాజా వార్తలు

చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు

మహిళలకు వైద్యులు కీలక హెచ్చరిక సిరా న్యూస్,న్యూఢిల్లీ; భారతీయ వస్త్రధారణలో చీరది ప్రత్యేక స్థానం. దేశంలో ఎక్కువ మంది మహిళలు చీరలే కట్టుకుంటారు. అయితే, చీర కట్టుకోవడాన్ని ఇష్టపడే మహిళలకు వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు ఉంటుందని తెలిపారు.మహారాష్ట్రలోని వార్ధలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ, బీహార్‌లోని మధుబని కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు ఇటీవల ఇద్దరు మహిళలు పార్శ్యంపై నొప్పితో వచ్చారు. వీరిని పరీక్షించిన వైద్యులు ఇద్దరికీ మార్జోలిన్‌ అల్సర్‌ అనే చర్మ క్యాన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు.వీరిద్దరూ రోజూ చీర కట్టుకుంటారని, చీర లోపల పెట్టికోట్‌ను నడుముకు బిగువుగా కట్టుకోవడం వల్లే చర్మ క్యాన్సర్‌ బారిన పడ్డారని వైద్యులు గుర్తించారు. నడుముకు బిగువుగా చీర లేదా పెట్టికోట్‌ కట్టడం వల్ల తీవ్రమైన ఒత్తిడి కలిగి అల్సర్‌…

Read More
7 Nov 2024, 6:32 pmsiranews.in